OTR : పిఠాపురంలో టీడీపీకి బ్రేకులు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిఠాపురం సైకిల్‌కు స్టాండ్ వేసేశారా? ఇప్పుడప్పుడే తీసి రన్నింగ్‌లో పెట్టే ఉద్దేశ్యం లేదా? మంత్రి ప్రోగ్రామ్ ఫిక్స్ అయి కూడా లాస్ట్ మినిట్‌లో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? అసలీ విషయంలో ఇప్పుడెందుకు కొత్త డౌట్స్ వస్తున్నాయి? తాజాగా ఏం జరిగింది….? లోకల్ తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారు? ఏపీలో రెండేళ్ళ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళే ఉద్దేశ్యంతో… ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరుగుతోంది. 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట వాళ్ళే ప్రోగ్రామ్ని లీడ్ చేస్తుంటే, లేని నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లు అల్లుకుపోతున్నారు. కానీ… ఒక్క పిఠాపురంలో మాత్రం ఈ రెండూ కనిపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ లీడ్ తీసుకోవాలి. కానీ…అలా తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు. ప్రస్తుతం పిఠాపురం సైకిల్ హ్యాండిల్ ఖాళీగా ఉంది. ఎవరైనా హ్యాండిల్ చేస్తారో లేదో కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. గతంలో జరిగిన రకరకాల పరిణామాలతో… ఇక్కడ కో ఆర్డినేటర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మను తప్పించింది పార్టీ. తరచూ.. టీడీపీ, జనసేన నేతల మధ్య పంచాయితీలు జరుగుతుండటం కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే… వర్మను పక్కకు తప్పించాక పిఠాపురం తమ్ముళ్లు పూర్తిగా డీలా పడిపోయారు. పార్టీ కోసం కష్టపడి పని చేసినందుకు మంచి గౌరవమే దక్కిందంటూ కొందరైతే సెటైర్లు కూడా వేశారు. వర్మని వాడుకుని వదిలేశారని కామెంట్ చేసే టీడీపీ కార్యకర్తలు సైతం లేకపోలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ప్రమోట్ చేస్తామంటూ గతంలో టీడీపీ పెద్దలు చెప్పారని, తీరా… సందర్భం వచ్చినప్పుడు చాలా గొప్పగా ప్రమోషన్ ఇచ్చారంటూ కొందరు ద్వితీయశ్రేణి టీడీపీ నేతలు బరస్ట్ అయిపోతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై కనీస స్పష్టత లేకుండా పోయిందట. అటు అధిష్టానం కూడా అక్కడ అంత స్పీడ్ అయిపోవడం కరెక్ట్ కాదంటూ బ్రేకులేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి పిఠాపురంలో టీడీపీ సభ్యత్వాలు బాగానే ఉన్నాయి.
కేడర్ బలానికేం తక్కువ కాదు. కానీ… నడిపించే నాయకుడులేకపోవడంతో వాళ్ళంతా మ్యూట్ మోడ్‌లోకి వెళ్లిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఎట్నుంచీ క్లారిటీ లేనప్పుడు ఎవరైనాసరే… ఎందుకు లీడ్ తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఒకవేళ ప్రోగ్రాం చేసినప్పుడు మీకు ఫలానా పనులు చేసి పెడతాం, ఫలానా సమస్యలు తీరుస్తామంటూ పబ్లిక్కు హామీ ఇవ్వాలి. మరి పిఠాపురం టీడీపీ లీడర్స్ ధైర్యంగా అలాంటి హామీలు ఇవ్వగలరా అన్నది ఇంకొందరి ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. ఆ క్రమంలో కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయిపోతున్నాయి. మరి పిఠాపురంలో ఆ పరిస్థితులు ఉంటాయా అని ప్రశ్నించే వాళ్ళకు సమాధానం దొరకడం లేదు. నియోజకవర్గ ఇన్ఛార్ లేడు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఆయన టూర్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. కానీ… చివరికి ఎక్కడ తేడా కొట్టిందోగానీ…ఆయన రాలేదు. ఈసారికి అలా కానిచ్చేయండి, మీదే చేసేయండంటూ మంత్రి ఆఫీస్నుంచి లోకల్ లీడర్స్‌కు వర్తమానం అందిందట. మంతిర వస్తారన్న ఊపుతో 28వ వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించిన వాళ్ళు కూడా… ఆయన రారన్న సంగతి తెలిశాక సైలెంట్‌గా సర్దుకున్నారట. గత ఎన్నికల్లో జనసేన తరపున ఇక్కడ లీడ్ చేసిన వాళ్ళకు మంచి పదవులే వచ్చాయిగానీ… టీడీపీ నాయకుడైన వర్మకు మాత్రం గుండుసున్నా మిగిలిందని, అందుకే టీడీపీ తరపున లీడ్ తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అలా ఉంటే.. అధిష్టానం లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయట. ఆ ఒక్క నియోజకవర్గంలో అడ్వాన్స్ అవ్వకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. కొత్త కాంట్రవర్సీలు రాకుండా ప్రశాంతంగా ముందుకు వెళితే చాలని అంటున్నట్టు తెలుస్తోంది. పిఠాపురం ఒక్కచోట డిస్ట్రబ్ అయితే… దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద రెండు పార్టీల సంబంధాలపై పడుతుందని, ఇప్పుడు అంత రిస్క్ అవసరమా అన్నది టీడీపీ పెద్దల మనోగతంగా తెలుస్తోంది. ఇప్పుడు హైప్ ఇవ్వాలనుకుంటే తర్వాత కంట్రోల్ చేయలేక తల బొప్పి కడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మాటలు వింటున్న లోకల్ టీడీపీ లీడర్స్ మాత్రం ఇక పిఠాపురం సైకిల్‌ను స్టాండ్‌కే పరిమితం చేసేస్తారా? అదే నిజమైతే మనం ఏం చేయాలంటూ గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం.
Also Read
- Tags
- NTV Telugu
- OTR
- pithapuram
- tdp
తాజావార్తలు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!