కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇమిటేట్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఇమిటేట్ చేశారు.