Kakani Govardhan Reddy: చంద్రబాబు డైరెక్షన్.. పవన్ యాక్షన్.. చెప్పిందే నిజమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Fires On Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని తాము గతంలోనే చాలాసార్లు చెప్పామని.. ఇప్పుడు దాన్ని వాళ్లు నిజం చేసి చూపించారని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా వ్యవహరించాడని.. ఇన్నాళ్లూ చంద్రబాబు డైరెక్షన్, పవన్ యాక్షన్‌గా సాగిందని.. ఎట్టకేలకు ఇప్పుడు ఇద్దరూ బయటపడ్డారని అన్నారు. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉన్న విషయాన్ని తాము ముందునుంచే చెప్తున్నామని, నేడు అది నిజమైందని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు ఒక అజెండా లేదని, వైసీపీ నేతలపై అతను చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఒక పార్టీకి అధినేతగా ఉంటూ.. ఆ విధంగా మాట్లాడటం చూస్తే, పవన్ నైజం ఏంటో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒరిగేదేమీ ఉండదని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోరాటం చేసిందని.. 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు, కాకినాడలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. సిఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న పరపతిని ఎదుర్కోలేకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. కుల, మతాల మధ్య ఘర్షణలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి అడ్రస్ లేనట్లు రిపోర్ట్ వచ్చిందని.. దీంతో లాభం లేదని గ్రహించిన చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ను వెనకేసుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. యువతను రెచ్చరొట్టి.. ఆ మంటల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చలి కాచుకోవాలనుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!