Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. “సినిమా వచ్చిన సీజన్ కరెక్ట్ కాదు. అదే వేరే ఏ ఇతర టైమ్‌లో రిలీజ్ అయినా ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది” అని అభిప్రాయపడ్డారు.
టికెట్ రేట్లు పెంచడానికి ప్రయత్నించడం సినిమాపై నెగెటివ్ ప్రభావం చూపిందని ఆయన అంగీకరించారు. “మేము టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించిన మొదటి సినిమా ఇది. నిజానికి ఆ పని చేయకుండా ఉండాల్సింది. దానివల్ల రిలీజ్ ఆలస్యం కావడం, ప్రేక్షకులు-ఫ్యాన్స్ తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అవ్వడం జరిగాయి” అని వివరించారు. సినిమాకు సైజ్, స్కేల్ పరంగా బెస్ట్ రిలీజ్ దక్కినప్పటికీ.. రిలీజ్ రోజే ప్రీమియర్ షోలు డిలే కావడం వంటి పలు సాంకేతిక, ఇతర సమస్యలు కూడా సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు.
Also Read
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
‘రాజా సాబ్’ నిరాశపరిచినా, చేతిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ తెలుగు హక్కులు మీ దగ్గరే ఉన్నాయి కదా.. దాంతో ఆ లోటు భర్తీ చేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా.. “‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించి నేను కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్ను మాత్రమే” అని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. సాధారణంగా పెద్ద సినిమాల ఫలితాలపై నిర్మాతలు త్వరగా స్పందించడానికి ఇష్టపడరు. అయితే, ఏమాత్రం దాపరికం లేకుండా సీజన్ ఎంపిక, రిలీజ్ రోజు ప్రీమియర్ల ఆలస్యం, టికెట్ రేట్ల పెంపు నిర్ణయాలే సినిమాపై ప్రతికూల ప్రభావం చూపాయని టీజీ విశ్వప్రసాద్ నిజాయితీగా అంగీకరించడం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!