Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quantum Valley Twin Towers: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక అడుగులు పడుతున్నాయి.. అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు పడింది. ఉద్దండరాయునిపాలెంలోని క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నిర్మాణాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న క్వాంటం వ్యాలీలో భాగంగా 11 ఎకరాల్లో రెండు భారీ టవర్లను నిర్మించనున్నారు. T1, T2 పేర్లతో నిర్మించే ఈ ట్విన్ టవర్లు మొత్తం 37,48,847 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆవిష్కరణలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన వర్క్‌స్పేస్‌లను ఈ టవర్లలో ఏర్పాటు చేయనున్నారు.
క్వాంటం వ్యాలీలో మొత్తం ఎనిమిది టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన రెండు టవర్ల నిర్మాణం పూర్తయితే సుమారు 25 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ.. సంప్రదాయ కంప్యూటింగ్‌తో పోలిస్తే విభిన్న అవకాశాలను ఒకేసారి పరిశీలించి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఈ సాంకేతికతకు ఉందని మంత్రి పేర్కొన్నారు. రక్షణ, వైద్యం, బ్యాంకింగ్ రంగాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించే అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆవిష్కరణలకు అమరావతిని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడంలో క్వాంటం వ్యాలీ కీలకంగా మారనుందని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా ట్విన్ టవర్స్ నిర్మాణంతో రాజధానిలో సాంకేతిక రంగానికి ఊతం లభించడంతో పాటు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులను మళ్లీ పట్టాలెక్కించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!