కాకినాడ జిల్లా తునిలో భర్త గెలుపుకోసం భార్య లక్ష్మీచైతన్య ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన భర్త తుని వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తుని మండలంలోని వల్లూరు, అగ్రహారం, సీతయ్యపేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి లక్షీచైతన్య ఎన్నికల ప్రచారాన్ని చేసారు. ఈ సందర్భంగా లక్ష్మీచైతన్య మాట్లాడుతూ.. మంత్రి దాడిశెట్టి రాజాని ముచ్చటగా మూడోసారి గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి…
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేపడుతున్నారు.
ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని ఆయన అన్నారు.
Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్‌కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని.. రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో…