Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan-TDP Leaders Meets: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు.. పవన్ కల్యాణ్‌తో దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే, పవన్ కల్యాణ్‌తో సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ నేతలు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన తరఫున కోరుతున్న సీట్లు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఆరు కార్పొరేషన్లతో పాటు 26 మున్సిపాలిటీలను జనసేన కోరుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్లకు సంబంధించిన వివరాలను పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేతలు వివరించారు. మిగిలిన అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు లింగమనేని రమేశ్‌తో చర్చించాలని పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు సూచించినట్లు సమాచారం. నాదెండ్ల మనోహర్‌తో జరిగే చర్చల అనంతరం సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన నేతల మధ్య కొనసాగుతున్న ఈ చర్చలు ఎలాంటి నిర్ణయానికి దారితీస్తాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!