Kakani Govardhan Reddy Comments On Suspended MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పుడు చేయడం వల్లే.. పార్టీ అధిష్టానం వారిని సస్పెండ్ చేసిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ జగన్ వల్లే గెలిచారన్న ఆయన.. జగన్ చెప్పిన వారికి ఓటు వేయకుండా వాళ్లు ద్రోహం చేశారని, ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే.. ముఖ్యమంత్రితో చర్చించాలే తప్ప, ఇలా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటన చేశారు తప్ప.. ఆ ఎమ్మెల్యేల పేర్లను చెప్పలేదన్నారు. డబ్బులు తీసుకున్న వారే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఎమ్మెల్యేలను ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.
MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్
పట్టభద్రుల ఎన్నికలను ఎదుర్కోవడం.. వైసీపీకి ఇది మొదటిసారి అని మంత్రి కాకాణి వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుందని.. ఇందులో కొంత వెనుక బడ్డామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలోనే ఓటు వేయాలని, టీడీపీ కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిందని చెప్పారు. టీడీపీకి ఓటు ఎవరు వేశారనేది అందరికీ తెలుసని.. వారి వైఖరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. కొందరు మరుసటి రోజు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎవరు పార్టీని వీడినా ఇబ్బంది లేదని.. పార్టీ పటిష్టంగానే ఉందని, కొత్త నేతలు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిర్దిష్టమైన ఆధారాలు పార్టీ అధిష్టానం వద్ద ఉన్నాయని, ఆ సాక్ష్యాలున్నాయి కాబట్టి వైసీపీ హైకమాండ్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు.
Kakani Govardhan Reddy: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. చర్చకు సిద్ధమా?
అంతకుముందు కూడా.. సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి కాకాణి సూచించారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందన్న ఆయన.. నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు. ఇష్టారీతిలో ఓటు వేస్తే కుదరదని, ప్రజల్లో మరింత బలహీన పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెండ్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.