Minister Kakani Govardhan Reddy Challenges Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పరిహారంపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. రైతులకు పరిహారంపై టీడీపీ, పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇది ఏమాత్రం సరికాదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందన్నారు. ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో కూడా స్పష్టం చేశామని, అప్పుడు అసెంబ్లీలో టీడీపీ నేతలు ఏమీ మాట్లాడలేదని అన్నారు. అయితే.. ఇప్పుడు అదే విషయాన్ని పచ్చ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడిన వెంటనే సీఎం జగన్ అధికారులతో సమీక్షించి, రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారని మంత్రి కాకాణి తెలిపారు. ఈ-క్రాప్ నమోదు చేయని రైతులకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించినట్టు గుర్తు చేశారు. అయితే.. పచ్చ మీడియా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు.. పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయని వివరించారు. తిత్లీ తుఫాన్ వచ్చినపుడు చంద్రబాబు పరిహారం ప్రకటించారే తప్ప.. డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పరిహారం ఇచ్చామని మంత్రి కాకాణి వెల్లడించారు.
Gudivada Amarnath: ఉండవల్లి కాదు, ఊసరవెల్లి శ్రీదేవి.. నటి శ్రీదేవి కంటే అద్భుతంగా నటిస్తున్నారు
అంతకుముందు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై మంత్రి కాకాణి స్పందిస్తూ, సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే నిర్దిష్టమైన ఆధారాలు అధిష్టానం వద్ద ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే.. ఆ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారని స్పష్టం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తామన్నారు. ఇష్టారీతిలో ఓటు వేసుకుంటామంటే కుదరదని.. ప్రజల్లో మరింత బలహీన పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెండ్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు ఎవరికుంటే వాళ్ళే అధికారంలోకి వస్తారన్న ఆయన.. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Sayyesha Saigal: స్టార్ హీరో భార్యవి..ఒక బిడ్డ తల్లివి.. ఇలా ఐటెంసాంగ్ చేయడం ఏంటి అమ్మడు