Potina Mahesh: చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగిందో అంబటి చూశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Potina Mahesh: వైసీపీ నేతలపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం జరిగిందో అంబటి చూశాడా అని ప్రశ్నించారు. లోపలకు వెళ్లి సోఫాల కింద దూరి విన్నావా అంబటి అని నిలదీశారు. బాబు-పవన్ కలిస్తే వైసీపీ నేతలకు ఎందుకు భయం అని సూటి ప్రశ్న వేశారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, కారుమూరు నాగేశ్వరరావు జగన్ చెప్పు చేతల్లో పని చేసే మంత్రులు అని పోతిన మహేష్ విమర్శలు చేశారు. వాళ్ల వాళ్ల శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు కనీసం అవగాహన లేదని చురకలు అంటించారు. వెల్లంపల్లికి మతి సరిగా ఉందో లేదో ఆస్పత్రిలో చూపించుకోవాలన్నారు. మసాజ్ కల్చర్ వెల్లంపల్లిది కాబట్టి.. ఆయనకు అవే గుర్తుకు వస్తాయన్నారు. వెలంపల్లి నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆయన అమ్మాయిలతో చేయించుకునే మసాజ్ వివరాలు బయటపెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు.
Read Also: Viral Video: ప్రధాని మోదీ వస్తున్నారని.. ఎండిపోయిన గడ్డికి గ్రీన్ కలర్
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
జీవో నెంబర్ 1తో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. జీవో నంబర్ 1 అంశంపైనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారన్నారు. వైసీపీ వరాహాలు గుంపులుగా వచ్చి పవన్ కళ్యాణ్‌పై విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. తాము వారాహి అని పేరు పెడితే.. వైసీపీ వరాహాలు ఏదేదో వాగాయని.. ఇక వారాహి రోడ్ మీదకు వస్తే.. ప్యాంట్లు తడుపుకుంటారని చురకలు అంటించారు. భయంతో నోరు పారేసుకుంటోన్న వైసీపీ నేతలకు ఆంజనేయుని తాయిత్తులు పంపుతామన్నారు. కేసీఆర్ దత్త పుత్రుడు జగన్ అని.. అందుకే ఇక్కడ నాశనం చేసి.. అక్కడ అభివృద్ధికి సహకరించారన్నారు. వైసీపీ చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ఏపీని సర్వనాశనం చేసేందుకే వైసీపీ పుట్టిందన్నారు. పండుగ చేసుకునేందుకు కనీసం డబ్బులు లేక పేదలు నరకం చూస్తున్నారన్నారు. జగన్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యలే శరణ్యం అనేలా చేశారని.. ప్రజలు బయటకి వచ్చి తమ ఆవేదన చెప్పినా పట్టించుకోవడం లేదని పోతిన మహేష్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?