Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా (SIR) అంశాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమ అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌ను వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా వార్డుల సరిహద్దులు ఫ్రీజ్ కావన్న అంశాన్ని ధర్మాసనం పేర్కొంది. మున్సిపాలిటీ సరిహద్దుల ఫ్రీజింగ్ నిబంధన వార్డులకు వర్తించదని జస్టిస్ బాగ్చి తెలిపారు. మరోవైపు SIR ఆధారిత ఓటర్ల జాబితా పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించకుండా, కొత్త జాబితా పూర్తయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కీలకంగా మారింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారం చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు విచారణపై ఇప్పడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..