Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- మోకాలి మిట్ట వద్ద చిరుత సంచారం
- వేకువజామున కనిపించిన చిరుత
- భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచన
- చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపింది. అలిపిరి మార్గంలోని ‘మోకాలి మిట్ట’ ప్రాంతంలో వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో నడక మార్గంలో భక్తులెవరూ సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పుంది. చిరుత సంచారానికి సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచన.. భద్రత పెంపు
నడక మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అటవీ శాఖ సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇటీవల కాలంలో అలిపిరి నడక మార్గంలో తరచూ చిరుతలు కనిపించడం భక్తులను ఆందోళనకు గురిచేస్తుండటంతో, టీటీడీ భద్రతా సిబ్బంది మరియు అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో పహారాను మరింత తీవ్రతరం చేశారు.
Also Read
- Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
- AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు 'నేషనల్ ఈ-విధాన్' (NeVA) శిక్షణ..
- Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. రూ.1.78 కోట్లతో ఆరు వాహనాలు కొనుగోలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్‌గా మారనున్న 'అక్వాన్'..
గుంపులుగా వెళ్లాలని భక్తులకు విజ్ఞప్తి
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ, టీటీడీ అధికారులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లకుండా ఎప్పటికప్పుడు గుంపులుగా సమూహాలుగా మాత్రమే ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని హెచ్చరించారు. నడక మార్గమంతటా భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి అనుమానాస్పద జంతు సంచారం కనిపించినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!