Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం (Global Food Crisis) ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక చేశారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ సమావేశంలో మాట్లాడిన ఆమె, భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నుంచి హోర్ముజ్ జలసంధి సమస్యల వరకు అనేక కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా సముద్ర మార్గాల్లో తలెత్తుతున్న ఆటంకాలు ప్రపంచ దేశాలకు ఎంత పెద్ద ముప్పుగా మారాయో స్పష్టంగా వివరించారు. హోర్ముజ్, బాబ్ అల్-మండేబ్ వంటి ప్రధాన సముద్ర రవాణా మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల ప్రపంచ దేశాల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. దీనికి తోడు మలక్కా జలసంధి ప్రస్తావన కూడా తీసుకొస్తూ, ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ ఒకవేళ అక్కడ కూడా రవాణాకు ఆటంకం ఏర్పడితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ గ్లోబల్ ఆహార సంక్షోభాన్ని, సవాళ్లను తట్టుకోవడానికి భారత్ ఇప్పటికే బలమైన చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎరువులను మోసుకొచ్చే షిప్పింగ్ లైన్లపై అదనపు భారం పడకుండా, పెరుగుతున్న ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పేమెంట్ల సకాలంలో చెల్లింపులకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక “షిప్పింగ్ ఎమర్జెన్సీ ఫండ్” (అత్యవసర నిధి)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం, ఓడల లభ్యత తగ్గడం, భారీగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడం వల్ల ఎరువుల దిగుమతికి తీవ్ర విఘాతం కలుగుతోందని, అందుకే దేశీయంగా యూరియా, ఫాస్ఫేట్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ కృషి చేస్తోందని అన్నారు. అయితే ఈ స్వదేశీ ఉత్పత్తి పూర్తిస్థాయికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
Also Read
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ఇక భారత్-అమెరికా వ్యాపార ఒప్పందం (Trade Deal) గురించి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ చర్చలు ప్రస్తుతం ఒక నిర్ణీత స్థితికి (Saturated Point) చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ దశలో ఇరు దేశాలు అంతకుమించి ఇచ్చిపుచ్చుకోవడం లేదా వెనక్కి తగ్గడం చాలా కష్టమైన విషయమని స్పష్టం చేశారు. అలాగే అమెరికా ప్రస్తుతం జరుగుతున్న చర్చల కంటే భిన్నమైన మార్గాల ద్వారా భారత్‌తో ఉన్న వ్యాపార లోటును (Trade Imbalance) తగ్గించుకోవాలని చూస్తోందని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?