Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర రీల్
- సూరత్ కంటెంట్ క్రియేటర్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Reel Row: గుజరాత్‌లోని సూరత్‌లో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన రీల్ పోస్ట్ చేసిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును అభ్యంతరకర రీతిలో చూపిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన మహిళను 47 ఏళ్ల సిమ్రాన్ పటేల్‌గా గుర్తించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్లు
సిమ్రాన్ పటేల్ సూరత్‌లోని అదాజన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె క్రమం తప్పకుండా షార్ట్ వీడియోలు, రీల్స్ పోస్ట్ చేస్తుంటారని వెల్లడించారు. పోలీసుల ప్రకారం.. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆమె ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉండటంతో, దానికి ముందు రోజు ఈ రీల్ పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
- UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
- MP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. 'ఇద్దరు పిల్లల నిబంధన'ను ఎత్తివేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
పోలీసులే షేర్ చేసిన ‘బిఫోర్-ఆఫ్టర్’ వీడియో
సిమ్రాన్ పటేల్ అరెస్ట్ విషయాన్ని సూరత్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మొదట సిమ్రాన్ పటేల్ రూ.500 నోటును చేతిలో పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తాయి. అనంతరం ఆమె చేతులకు బేడీలు ఉన్న దృశ్యాలను పోలీసులు చూపించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోను పోస్ట్ చేసినందుకు ఆమె క్షమాపణలు చెబుతున్న దృశ్యాలు కూడా పోలీసుల వీడియోలో ఉన్నాయి.
మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న కరెన్సీ నోటును అభ్యంతరకరంగా చూపిస్తూ సిమ్రాన్ పటేల్ రీల్ రూపొందించారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ధర్మేశ్ గామి సూరత్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల లేదా అభ్యంతరకరమైన సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో సూరత్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సమాజంలో విభేదాలు, అశాంతి లేదా సామాజిక విద్వేషాలకు దారితీసే అవకాశం ఉన్న అభ్యంతరకరమైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ప్రజలను కోరారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిమ్రాన్ పటేల్ వివాహం అనంతరం సుమారు 17 ఏళ్ల క్రితం సూరత్‌లో స్థిరపడ్డారు. ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఏదైనా వీడియో లేదా రీల్ పోస్ట్ చేసే ముందు దాని ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.
સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવાની લાલચમાં કાયદાનું ઉલ્લંઘન ભારે પડી શકે છે… https://t.co/iWR69Pgps9
— Surat City Police (@CP_SuratCity) October 4, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..