కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. వాటి గుర్తింపు బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేసిన మంత్రి.. ఆయా గ్రామాల్లో కరోనా కేసుల ఆధారంగా బెడ్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.. స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలు ఉంటాయన్నారు.