Gudivada Amarnath: సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలోని సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. వారాహి సభలో పవన్ ప్రసంగం విషం, విద్వేషం, అహంకారంతో సాగిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించయాలనే అసూయ పవన్‌లో కనిపించిందన్నారు. జగన్‌ను తిడితే నాయకుడ్ని అయిపోతానని పవన్ భావిస్తున్నారన్నారు. వారాహి లారీ మీద చేస్తున్న ప్రసంగాలు జగన్ నాయకత్వంను విమర్శించడం తప్ప.. పార్టీ సిద్దాంతం, విధానం చెప్పడం లేదన్నారు. దత్తత తండ్రి చంద్రబాబు దగ్గర బానిస బ్రతుకు బతుకుతున్న పవన్‌ను చూసి జాలిపడుతున్నామని ఎద్దేవా చేశారు.
Delivery Boy: దారుణం.. డెలివరీ లేటైందని కాలు విరగ్గొట్టిన కస్టమర్..
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
వేమన చెప్పినట్టు.. అల్పుడెపుడు పలుకు సూక్తి పవన్‌కు సరిపోతుందని అమర్నాథ్ పేర్కొన్నారు. యువరాజ్యం అధ్యక్షుడు నుంచి ఇప్పటివరకు గత 15 ఏళ్లలో సిద్ధాంతం, స్థిరత్వం, విధానం లేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. పొత్తులు పెట్టుకునే పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయన్నారు. సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానమని తూర్పారపట్టారు. వారాహి సభల్లో పార్టీ విధానం, అజెండా ప్రకటించి ఓటు వేయమని అడగడం మానేసి.. చంద్రబాబు స్కీంలో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని అన్నారు. పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బానిస బ్రతుకు బ్రతుకుతున్న పవన్ వెంట నడుస్తున్న కార్యకర్తలను చూసి జాలేస్తుందన్నారు. రాజకీయాలంటే సినిమా యాక్టింగ్ కాదు.. ప్రజల సమస్యలు, ప్రాంతాల అభివృద్ధి, జనం అవసరాలని.. ఇవీ ముఖ్యమని సూచించారు. జనం ఆమోదించిన జగన్‌ను చూసి పవన్‌కు ఎందుకు కోపమని ప్రశ్నించారు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
జగన్‌కు అధికారం పోవాలి అంటున్న పవన్.. నేనే ముఖ్యమంత్రి అని ఎందుకు చెప్పడం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ తరహాలో చంద్రబాబుకు వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలు ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. పొలిటికల్ ఐడెంటిటీ లేని పార్టీ జనసేన పార్టీ అని కౌంటర్ వేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఎవరికి భయమన్న అమర్నాథ్.. కేంద్రానికి కాకపోతే బైడన్‌కో, పుతిన్‌కో చెప్పుకో అని, తమకేం భయం లేదని తేల్చి చెప్పారు. కేంద్రం దగ్గర పవన్‌కు ఉన్నది పలుకుబడి కాదని, చంద్రబాబు దగ్గర రాబడి అని చురకలంటించారు. రాజకీయాల్లో పవన్ ఓ పిల్లబచ్చా అని.. ఇటువంటి వాళ్లను చూసి భయపడే వ్యక్తి జగన్ కాదన్నారు. ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!