విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కంటైనర్ టెర్మినల్ దిగ్భంధించేందుకు మత్స్యకారులు ప్రయత్నించారు.షిప్ లు వచ్చే మార్గంలో బోట్లు అడ్డు పెట్టి నిరసనకు ప్రయత్నం చేశారు. 25కు పైగా సంప్రదాయ పడవల్లో వెళ్లిన జాలర్లు నిరసన తెలుపుతున్నారు. కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేట్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు మత్స్యకార్మికులు. 15ఏళ్ల నుంచి హామీలను వాయిదా వేసుకుని వస్తున్న యాజమాన్యం వైఖరిపై నిరసన తెలుపుతున్నారు. మత్స్యకారులు ఆందోళనలతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
Read Also: Kishan Reddy: హైదరాబాద్ పర్యటన.. ఖైరతాబాద్ లో మింట్ మ్యూజియం సందర్శించనున్న కేంద్రమంత్రి
అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. అడిషనల్ డీసీపీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కొనసాగుతోంది. తమన నిరసనల్లో భాగంగా కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు మత్స్యకారులు. విధులకు వెళ్లే సిబ్బందిని అడ్డుకుని నిరసన. తెలుపుతుండడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మత్స్యకార పెద్దలతో చర్చలు జరుపుతున్నారు పోలీసులు.
Read Also: Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్