మార్చి 2026 నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాల పరిమితి పొడిగింపు చేశాం అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయని, హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే దాదాపు 57 శాతం పనులు పూర్తయ్యాయి కానీ కీలకమైన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్…
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఫిషంగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు..
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు.
ఆదివారం కావడం వలన విశాఖలోని నాన్ వెజ్ మార్కెట్లు, దుకాణాలు కితకితలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో నాన్ వెజ్ మార్కెట్లకు ఎలా వెళ్లినా పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ, ప్రస్తుతం దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఆంక్షలు జారీ చేస్తున్నా అవి…