Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lemon Prices: వేసవి సీజన్ ప్రారంభం కావడంతో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల వరకు కిలో రూ.30 దాటని నిమ్మకాయలు, ఇప్పుడు మార్కెట్‌లో ఏకంగా రూ.120 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి. ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, రైతులు మాత్రం దిగుబడి లేక ఆవేదన చెందుతున్నారు. ఏలూరు నిమ్మకాయల యార్డులో ప్రస్తుతం కిలో నిమ్మకాయలు రూ.120 నుంచి రూ.130 వరకు అమ్ముడవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా రేట్లు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేసవి కారణంగా పెరిగిన డిమాండ్
వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు, నిమ్మరసం, గృహ వినియోగం కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో సహజంగానే మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. అయితే, సరఫరా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read
దిగుబడి లేక రైతుల ఆవేదన
ధరలు పెరిగినా రైతులు ఆనందంగా లేరు. కారణం, ఈసారి నిమ్మకాయల దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది. తెగుళ్ల ప్రభావం, వాతావరణ మార్పులు కారణంగా పంట నష్టపోయిందని.. సరైన దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. గతంలో ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 15 బస్తాలు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. ధరలు పెరిగినా అమ్మడానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో లాభం లేదని అంటున్నారు. అయితే, నిమ్మకాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఒక్కో నిమ్మకాయ ధర కూడా పెరగడంతో రోజువారీ వినియోగంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!