Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- చింతూరు ఏజెన్సీలో మరోసారి డోలీ మోత..
- పాము కాటుకు గురైన 16 ఏళ్ల సమ్మక్క ప్రియ..
- కర్మన్ కొండ గ్రామం నుంచి డోలీలో కూటూరుకు తరలింపు...
- 4 కొండలు ఎక్కి, దిగి బాధితురాలిని మోసుకెళ్లిన గిరిజనులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Agency: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో వైద్య, రవాణా సౌకర్యాల కొరత మరోసారి బహిర్గతమైంది. పాము కాటుకు గురైన ఓ గిరిజన బాలికను అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలిలో మోసుకుంటూ కొండలు దాటి ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం కర్మన్ కొండ గ్రామానికి చెందిన 16 ఏళ్ల సమ్మక్క ప్రియ పాము కాటుకు గురైంది. అత్యవసరంగా వైద్యం అవసరమైనప్పటికీ గ్రామానికి అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో కొండరెడ్డి గిరిజనులు బాలికను డోలిలో పడుకోబెట్టి సుమారు నాలుగు కొండలు ఎక్కి, దిగి కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఈఎంటీ వెంకట్ విధుల్లో లేకపోయినా మానవత్వంతో స్పందించారు. తన సొంత బైక్‌పై వెళ్లి బాధితురాలిని ఆసుపత్రికి చేర్చేందుకు సహకరించారు. అయితే కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ బాలికకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ డోలి మోతలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర వైద్య సేవలు, రోడ్లు, అంబులెన్స్ సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!