Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- నేటి నుండి పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్..
- 18 రోజులుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర..
- ఇటీవల రంపచోడవరం ఆర్డీవో, పోలవరం జిల్లా జేసీ బోట్ల తనిఖీ..
- అనంతరం ఐదు శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ బోట్ల పరిశీలన..
- వర్షాల కారణంగా తగ్గిన పర్యాటకుల సంఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papikondalu Boat Tour: పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. గత 18 రోజులుగా నిలిచిపోయిన బోటు యాత్రలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇటీవల రంపచోడవరం ఆర్డీవో, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బోట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయగా, అనంతరం రెవెన్యూ, పర్యాటకం, జలవనరులు, పోలీసులు, రవాణా తదితర ఐదు శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ బోట్ల భద్రతా ప్రమాణాలను పరిశీలించింది.
గోదావరిలో ప్రయాణించే ప్రతి బోటు పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలని, లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్వాహకులకు స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అన్ని భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండటంతో దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రను తిరిగి ప్రారంభించారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో నేడు కేవలం రెండు బోట్లలో మాత్రమే పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు కొనసాగిస్తామని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!