ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నాడు.. విద్యార్థులకు మరో శుభవార్త.. ఇప్పటికే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. పేద విద్యార్థులు కూడా అందరూ చదువుకునేలా చేసేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోన్న వస్తోంది వైసీపీ ప్రభుత్వం.. ఇక, ఇవాళ మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని నాలుగు లక్షల 60వేల మంది విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది.. అంతేకాదు, హైస్కూళ్లలోని దాదాపు 60 వేల మంది టీచర్లకు కూడా ట్యాబ్‌లు అందించనుంది ఏపీ సర్కార్..
Read Also: Astrology : డిసెంబర్ 21, బుధవారం దినఫలాలు
విద్యార్థులకు ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు అధికారులు.. ట్రయల్ మెథడ్‌లో నిడమానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేశారు.. ఆఫ్ లైన్ ఫార్మెట్‌లో ట్యాబ్‌లు అందిస్తారు.. బైజూస్ కంటెంట్‌ని అప్‌లోడ్ చేసిన ఆ ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.. కోర్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాల వీడియోలు, ఎక్సర్‌సైజులు ఆ ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు. విద్యార్ధుల లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్యాబ్‌లు పెంచుతాయని అంచనా వేస్తున్నారు.. అయితే, ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు సీఎం జగన్.. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, ఈ పర్యటన కోసం ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు… ఇక, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు బాపట్ల జిల్లా నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మొత్తంగా సీఎం జగన్.. తన పుట్టిన రోజు నాడు విద్యార్థులకు ట్యాబ్‌లు అందించబోతున్నారు.. మరోవైపు.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జనసేన పుట్టిన రోజు వేడుకువలను ఘనంగా నిర్వహిస్తోన్న విషయం విదితమే.