Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- ఆల్గోరిథం మార్చాల్సిందే, డీప్‌ఫేక్, తప్పుడు ప్రచారం అరికట్టాల్సిందే..
- మెటాకు కేంద్రం అల్టిమేటం..
- ప్రాపంగండా కంటెంట్ అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన సమావేశంలో కంపెనీ ప్రస్తుత కంటెంట్ మోడరేషన్ వ్యవస్థ, హానికర కంటెంట్‌ను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై చర్చించారు.
ప్రాపంగండా కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఇమేజెస్, చట్టవిరుద్ధం కంటెంట్ వ్యాప్తిని తగ్గించేలా ఆల్గోరిథంలో మార్పులు చేయాలని ప్రభుత్వం మెటాకు సూచించింది. భారత డేటా లోకలైజేషన్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, దీని అర్థం భారత యూజర్ల డేటాను భారత్ లోని సర్వర్లలో నిల్వ చేయడం లేదా దాని కాపీని భారత్‌లో ఉండచం చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ అధికార సంస్థల గురించి అభ్యంతరకర కంటెంట్‌ను వేగంగా తొలగించాలని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల క్విక్ రెస్పాన్స్ టీమ్‌ల (QRTs)తో మెటా నేరుగా సమన్వయం చేసుకోవాలని కేంద్రం సూచించింది. డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, ఫేక్ కంటెంట్ ను వేగంగా గుర్తించి తొలగించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపింది.
Also Read
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన సమావేశంలో మెటా తన ఆల్గోరిథంలో లోపాలు ఉన్నట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతను మరింత పెంచడంతో పాటు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏఐ సాయంతో రూపొందిస్తున్న తప్పుడు కంటెంట్‌ను ముందుగా గుర్తించి అడ్డుకునే టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!