Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఎలేవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఎలేవన్, మ్యాచ్ మొదటి రోజు ముగిసేసరికి 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రవిందు రసంత, నిషాన్ మదుష్కతో పాటు కెప్టెన్ సోనాల్ అర్ధశతకాలతో రాణించడంతో జట్టు ఆరంభం నుంచే బలమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
జట్టులో రవిందు రసంత 143 బంతుల్లో అత్యధికంగా 71 పరుగులు చేయగా, మదుష్క 66 పరుగులు, సోనాల్ 51 పరుగులు సాధించారు. భారత్ తరఫున స్పిన్నర్లు మానవ్ సుథార్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా మానవ్ సుథార్ 13 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు.
Also Read
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి వేలికి గాయం కావడంతో తొలి రోజు ఆట నుంచి దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. గిల్ ఆరోగ్య పరిస్థితులను బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాగా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆటగాళ్లందరికీ అవకాశం ఇచ్చేందుకు వీలుగా 11 మంది బ్యాటింగ్, 11 మంది ఫీల్డింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో పిచ్ స్వభావంపై భారత జట్టు యాజమాన్యం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణంగా శ్రీలంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి, కానీ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పిచ్‌పై ఎక్కువ మొత్తంలో గడ్డి ఉండటంతో స్పిన్‌కు ఏమాత్రం సహకరించలేదు. రాబోయే ప్రధాన టెస్టు సిరీస్‌లో స్పిన్ పిచ్‌లను అందించి, ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇలాంటి పిచ్ ఇవ్వడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు, సరైన బౌలింగ్ కాంబినేషన్‌ను ఎంచుకునేందుకు భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!