Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneswari Emotional: చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. యామగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆమె, ఇది ఎన్నికల ప్రచారం కాదని, మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో తన మనసులోని మాటను చెబుతున్నానని పేర్కొన్నారు. స్త్రీ అమ్మలాంటిది అది మగవారికి గుర్తుకు తేవడానికి చేబుతున్నాను.. మహాభారతంలో కౌరవులు భర్తను అవమానించాలనే ఉద్దేశంతో ద్రౌపది అమ్మవారి వస్త్రాపహరణంకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భర్తను దెబ్బతీయడానికి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు.. గతంలో అసెంబ్లీలో చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తన పేరును లాగారని, తనపై కూడా లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
“నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు.. ప్రజలకు కూడా తెలుసు. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు” అని భువనేశ్వరి స్పష్టం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా ఎదుర్కోవాలని, మహిళలను వివాదాల్లోకి లాగడం తగదని అన్నారు. ఇక, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్న ఆమె, గత ఎన్నికల్లో ప్రజల రూపంలో దేవుడే తమకు అండగా నిలిచారని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.. మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారని, ఆ మద్దతును జీవితాంతం మరచిపోలేనని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.
Also Read
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?