Minister Ram Prasad Reddy: చిత్తూరు జిల్లా రొంపిచర్లలో పుంగనూరు ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిన ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రావడం ఆస్యాస్పదం అని మండిపడ్డారు. పుంగనూరు రైతులు ప్రజలపై రాళ్ల దాడి చేయించిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అయినా అధికార మదం వాళ్లకు తగ్గలేదు అని విమర్శించారు. పుంగునూరులో సమస్యలు చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వారిపై దాడులు చేయించడానికి ఎంపీ ప్రయత్నించాడు.. మాజీ సీఎం లాగా ప్రస్తుత మా అధినాయకత్వం దాడులు చేయమని చెప్పడం లేదు అని మంత్రి ఎద్దేవా చేశారు. శాంతియుతంగా పరిపాలన సాగించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం.. పుంగనూరు అభివృద్ధిపై మేము చర్చించకుండా ఎంపీ గురువారం ఉదయం ఎవరికి తెలియకుండా పుంగునూరు చేరుకొని అక్కడ గలాటాలు చేయించి అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: UP BJP: యూపీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. ఓటమికి 6 కారణాలు చెప్పిన పార్టీ..
ఇక, గత ప్రభుత్వ హయాంలో పాడి రైతులు మామిడి రైతులు రక్తం తాగిన వీళ్లు ఆస్తులు కాపాడుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గనులు, క్వారీలు మద్యంపై గుప్తాధిపత్యం సాధించి దోచుకున్నవన్నీ కాపాడుకోవడమే వారి లక్ష్యం.. ప్రజలు మనసు మళ్లించడానికి రౌడీలను తీసుకొని దాడులు చేయించి.. వారు పబ్బం కడుపుకోవడం మంచిది కాదు అని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తూ మేము ఊరుకోం అని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: UP BJP: యూపీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. ఓటమికి 6 కారణాలు చెప్పిన పార్టీ..
అయితే, గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై, నాయకులపైన దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టలేదా అని చల్లబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయానికి ఎవరైనా గదులు అద్దెకిస్తే వారిని బెదిరించి కార్యాలయాలు ఖాళీ చేయించలేదా.. ఇలాంటివన్నీ మీరు చేసి ప్రస్తుతం ఇప్పుడు మాపై బురద చల్లడం మంచి పద్ధతి కాదు అన్నారు. మా అధిష్టానం మాకు శాంతియుత మార్గంలో పరిపాలన సాగించాలని చెబుతుంది.. అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి అండదండలు అందిస్తామన్నారు. ఈ రోజు జరిగిన దాడిలో ఇరు వర్గాల కార్యకర్తలు ఇబ్బందులు పడిన విషయం మీరు గుర్తించలేదా అని చల్లబాబు చెప్పుకొచ్చారు.