ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ (BC)లకు శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు..