Pawan Kalyan and Chandrababu: పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. పొత్తు దిశగా అడుగులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.. అంతకుముందు బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.. జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయని గుర్తుచేసుకున్న పవన్.. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా.. పూర్తిస్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలుసని.. ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం అంటే నాకు గౌరవమే.. అలాగని ఊడిగం చేయలేనంటూ కుండ బద్దలు కొట్టేశారు పవన్.. ఈ వ్యాఖ్యల తర్వాత.. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు చంద్రబాబు రావడం ఆసక్తికరంగా మారింది.
Read Also: SBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వారికి మాత్రమే..!
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, జనసేన శ్రేణులు.. మంత్రుల కార్లపై దాడి చేశారనే ఆరోపణలతో.. జనసేన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడం.. హోటల్‌కే పవన్ పరిమితం కావడం.. విశాఖ నుంచి తిరుగు ప్రయాణంలో ఆంక్షల మధ్య పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం లాంటి పరిణామాలపై గుర్రుగా ఉన్నారు జనసేనాని.. విజయవాడ చేరుకున్న తర్వాత వైసీపీపై దుమ్మెత్తిపోశారు.. ఇక, ఇవాళ జరిగిన కార్యక్రమంలో.. వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తనను ప్యాకేజీ స్టార్ అని పిలిస్తే.. చెప్పుతో కొడతానంటూ చెప్పుతీసి మరీ చూపించారు పవన్.. అంతేకాదు.. తన సంపాదన, పన్నుల వివరాలు కూడా వెల్లడించారు.. ఇదంతా అధికార పక్షంపై ఎదురుదాడిగా భావించినా.. బీజేపీతో పొత్తు విషయంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు తెరలేపాయి.. ఇదే సమయంలో.. విజయవాడలో పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్‌కు వచ్చిన చంద్రబాబు.. ఆయనతో భేటీ అయ్యారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీభావం తెలిపేందుకే వచ్చారని చెబుతున్నా.. ఈ భేటీకి రాజకీయం వ్యూహం కూడా ఉందనే చర్చ సాగుతోంది. జనసేనాని, టీడీపీ అధినేత భేటీలో.. మెగా బ్రదర్ నాగబాబు, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
మరోవైపు.. బీజేపీ పొత్తుపై పవన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శిబిరం నుంచి కూడా కౌంటర్ ఇచ్చింది.. ఇంత కాలం ముసుగులో ఉన్నారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ అసలు రంగు బయటపడిందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్నినాని.. అంటే.. పవన్ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికే ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. అయితే, గతంలో.. కలిపి పనిచేసిన విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మంచిదనే భావనలో పవన్ ఉన్నారనే ప్రచారం సాగుతున్నా.. బీజేపీ ఈ విషయంలో కలిసిరాకపోవడంతో.. బీజేపీతో నడిస్తే.. వైసీపీని ఢీకొట్టడం కష్టమని.. తెలుగుదేశం పార్టీతో జతకడితే.. జగన్ కోటను బద్ధలు కొట్టవచ్చుఅనే ప్లాన్‌లో పవన్ కల్యాణ్ ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నమాట.. మరి, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..