Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కేడర్‌ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జోనల్ విధానం, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను జిల్లా , జోనల్ కేడర్లుగా స్పష్టంగా విభజించారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం.. వివిధ కేటగిరీల ఉపాధ్యాయ పోస్టుల పరిధులను నిర్దేశించారు. జీవో నంబర్ 202 ప్రకారం.. మండల పరిషత్ (ఎంపీపీ), జిల్లా పరిషత్ (జడ్పీ) పాఠశాలల్లో సేవలు అందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా కేడర్ ఉద్యోగులుగా ఖరారు చేశారు. అదేవిధంగా.. జీవో నంబర్ 201 ద్వారా ఉపాధ్యాయ రంగానికి చెందిన సుమారు 27 రకాల వివిధ కేటగిరీల ఉపాధ్యాయ పోస్టులను సైతం జిల్లా కేడర్ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read
మరోవైపు.. పాఠశాలల నిర్వహణ, పాలనా సౌలభ్యం కోసం ప్రధానోపాధ్యాయుల పోస్టుల విషయంలో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ఎంపీపీ అలాగే జడ్పీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం) పోస్టులను జిల్లా కేడర్ కాకుండా జోనల్ కేడర్‌గా నిర్ధారించారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు, పరిపాలనాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం ఈ కేడర్ల విభజనను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా ఉత్తర్వులతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు , సర్వీస్ విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేడర్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావడంతో విద్యాశాఖలో తదుపరి పరిపాలనా చర్యలకు మార్గం సుగమమైంది.
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!