Byreddy Siddarth Reddy: పవన్ కళ్యాణ్ ‘రంగం’ సినిమాలో విలన్ లాంటోడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byreddy Siddarth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏంచేస్తుందో చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో జగన్ ప్రవేశిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయన్నారు. జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని బైరెడ్డి అన్నారు. ఆ దృష్టితోనే తాను జగన్‌కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించానని.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారని.. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో, ఏం పొడుస్తారో తెలియదు కానీ… జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Fact Check: ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని ప్రచారం.. ఖండించిన ఏపీ పౌరసరఫరాల శాఖ
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
పవన్ కళ్యాణ్ రంగం సినిమాలో విలన్ లాంటోడని బైరెడ్డి అన్నారు. ఈ సినిమాలో విలన్ బయటికేమో ఉద్యమం అంటాడని, పోరాటం అంటాడని.. లోపలేమో ఉగ్రవాదులతో పొత్తుపెట్టుకుని ఉంటాడని.. పవన్ కూడా అంతేనని వివరించారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు, పేద ప్రజలను మోసం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని.. అలాంటి వ్యక్తికి పవన్ మద్దతు తెలపాల్సిన అవసరం ఏముందని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ప్రశ్నించారు. అటు ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపైనా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు కనీసం 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా అని ప్రశ్నించారు. హైపర్ ఆది లాంటి వాళ్లు తాము ఎలాంటి నాయకుల కింద పనిచేస్తున్నామో గుర్తించాలని అన్నారు. తమ పార్టీలో ఉన్నప్పుడు పవన్‌ను బూతులు తిట్టి, ఇప్పుడు ఆయన పార్టీలోకి వెళ్లి తమను బూతులు తిట్టేవాళ్లను కూడా చూశామన్నారు. అయితే హైపర్ ఆది లేదా ఆ పార్టీకి చెందిన ఇతర వక్తలను గానీ తప్పుబట్టనని, ఆ పార్టీ నాయకత్వాన్నే తప్పుబడతానని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..