Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. రానున్న 24 గంటల తర్వాత సముద్రంలో గాలుల వేగం పెరిగి, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం మరింత బలపడి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. తుఫాన్‌గా మారిన తర్వాత ఇది తన దిశను మార్చుకుని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
Also Read
- Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
- Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
- CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
- Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించారు. మరోవైపు, వరి కోతల సమయం కావడంతో అకాల వర్షాల హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అల్పపీడనం కదలికలను, తుఫాన్ తీవ్రతను వాతావరణ కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాబోయే 48 గంటల్లో దీని గమనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
తాజావార్తలు
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
-
UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
-
Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
-
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!