AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ మేరకు నవంబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో గురువారం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
నవంబర్ 14 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14న నోటిఫికేషన్ విడుదలతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 16 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఉంటుంది. నవంబర్ 17న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 19 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక, ఎన్నికల పోలింగ్ నవంబర్ 26న నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఏవైనా కారణాలతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడితే నవంబర్ 27న రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం డిసెంబర్ 5న పరోక్ష ఎన్నికల (ఇండైరెక్ట్ ఎలక్షన్) ప్రక్రియ నిర్వహించనున్నారు.
Also Read
- AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
- Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!
- Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
నాలుగు కార్పొరేషన్లు.. 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు
రాష్ట్రంలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మరో 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఈసీ అధికారులకు సూచించింది. నామినేషన్లు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అభ్యర్థులు పోలీసు ఎస్కార్ట్‌తో వెళ్లి నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపింది.
నాలుగు నెలలుగా ఎన్నికల ఏర్పాట్లు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గత నాలుగు నెలలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 14న తిరుపతిలో జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల భద్రత, శాంతిభద్రతల నిర్వహణ, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. మరోవైపు.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలపైనా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రేపు పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
PM Modi: 2047 డెడ్‌లైన్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.. మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు
-
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?
-
Idupu Kayitham Teaser: ‘ఇడుపు కాయితం’ అంటే.. విడాకులా..?
ట్రెండింగ్
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!