Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cigarette Prices Hike: సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ (ITC) కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ బ్రాండ్ గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ల ధరలను మరోసారి పెంచింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.10 పెంచడంతో గురువారం స్టాక్ మార్కెట్లో సిగరెట్ కంపెనీల షేర్లు జోరందుకున్నాయి. ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో 4% వరకు లాభపడ్డాయి. పెరుగుతున్న పన్నుల భారం, చట్టబద్ధమైన సిగరెట్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో ఈ ధరల పెంపు చేయాల్సి వచ్చింది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. 60 నుంచి 70 మి.మీ. పొడవు ఉండే గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ ఫిల్టర్ టిప్డ్ (RSFT) సిగరెట్ల 10 ప్యాకెట్ ధరను ఐటీసీ రూ.125 నుంచి రూ.135కు పెంచింది. అంటే సుమారు 8% ధర పెరిగింది. కొత్త ధరలతో కూడిన స్టాక్‌లు నవంబర్ నాలుగో వారం నాటికి గోదాములకు చేరుకోనున్నాయి. 2026లో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం బ్రాండ్‌పై ఐటీసీ ధరలు పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్‌లో ఒక్కో ప్యాకెట్ ధరను రూ.115 నుంచి రూ.125కు పెంచింది. తాజాగా మరో రూ.10 పెంచడంతో ఈ ఏడాది ప్రారంభ ధరతో పోలిస్తే మొత్తం పెరుగుదల సుమారు 17.4 శాతానికి చేరింది.
Also Read
- Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
- Supreme Court Divorce Ruling: విదేశాల్లో విడాకులు.. భారత్‌లో రెండో పెళ్లి చేసుకోవచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
- Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
- AP Panchayat Elections: రసవత్తరంగా పంచాయతీ పోరు.. ఏకగ్రీవం చేస్తే ఎకరం పొలం.. రూ.50 లక్షల ఆఫర్!
ధరల పెంపు వార్తలతో గురువారం ట్రేడింగ్‌లో ఐటీసీ షేరు గరిష్ఠంగా 1.61 శాతం పెరిగి రూ.289.10కు చేరుకుంది. మరోవైపు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేరు 3.52% లాభంతో రూ.1,889 స్థాయిని తాకింది. సిగరెట్లపై పన్నులు గణనీయంగా పెరగడంతో ఐటీసీ తన ధరల విధానాన్ని సమీక్షిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. చట్టబద్ధంగా విక్రయించే సిగరెట్ల ధరలకు, అక్రమంగా విక్రయించే సిగరెట్ల ధరలకు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. దీంతో చట్టబద్ధమైన మార్కెట్లో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి కొనసాగుతోంది.
వినియోగదారులు తక్కువ ధరకు లభించే అక్రమ సిగరెట్ల వైపు మళ్లకుండా ఉండేందుకు, అదే సమయంలో వ్యాపార లాభదాయకతను కాపాడుకునేందుకు ఆచితూచి ధరలను సవరిస్తున్నట్లు ఐటీసీ తెలిపింది. ఈ ప్రభావం కంపెనీ ఆర్థిక ఫలితాల్లోనూ కనిపించింది. ఐటీసీ సిగరెట్ వ్యాపారంలో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. కంపెనీ సిగరెట్ ఆదాయంలో ఈ విభాగం వాటా సుమారు 50 శాతం వరకు ఉంటుంది. ఐటీసీ మొత్తం లాభదాయకతలోనూ సిగరెట్ వ్యాపారం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలో లాభాల మార్జిన్లు 70% వరకు ఉంటాయని అంచనా.
పెరుగుతున్న పన్నుల భారం మధ్య లాభాలను కాపాడుకోవడంతో పాటు వినియోగదారులపై ధరల ప్రభావాన్ని పరిమితం చేయడం ఐటీసీకి సవాలుగా మారింది. మరోవైపు విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న సిగరెట్లతో పోటీని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త వేరియంట్లు, ట్రేడ్‌మార్క్‌లతో తన సిగరెట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది. దేశీయ మార్కెట్లో పన్నుల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ సిగరెట్ల వ్యాపారం పెరుగుతోందని, ఇలాంటి సరుకుల స్వాధీనం ఘటనలు కూడా ఎక్కువయ్యాయని ఐటీసీ పేర్కొంది.
తాజావార్తలు
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
-
TVS Callisto 110: టీవీఎస్ Callisto 110 స్కూటర్ లాంచ్.. 33 లీటర్ల స్టోరేజ్, బ్లూటూత్, నావిగేషన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Supreme Court Divorce Ruling: విదేశాల్లో విడాకులు.. భారత్‌లో రెండో పెళ్లి చేసుకోవచ్చా? సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
ట్రెండింగ్
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!