CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, నూతన ఆసుపత్రుల నిర్మాణం, వైద్యుల నియామకాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీలు ఈ మూడు టిమ్స్ ఆసుపత్రుల మధ్యే జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆసుపత్రులలో హౌజ్ కీపింగ్ బాధ్యతలను పూర్తిగా అవుట్ సోర్సింగ్‌కు అప్పగించాలని, తద్వారా వైద్యులు కేవలం చికిత్సలపైనే పూర్తి దృష్టి సారించేలా చూడాలని సూచించారు. హాస్పిటల్ నిర్వహణ అత్యంత కీలకమని, వైద్యులు, సిబ్బంది హాజరు విషయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు.
నిమ్స్ – సనత్ నగర్ టిమ్స్ మధ్య సమన్వయం..
నిమ్స్ ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేని పక్షంలో రోగులను వెంటనే సనత్ నగర్ టిమ్స్‌కు తరలించాలని, ఇందుకోసం నిమ్స్, టిమ్స్ మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్‌లో శాశ్వత డాక్టర్ల నియామకం పూర్తయ్యేంత వరకు, రోగులకు ఇబ్బంది కలగకుండా బయట నుంచి వైద్యులను నియమించుకోవాలని ఆదేశించారు.
Also Read
- Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
- YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..
- Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
వచ్చే జూన్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని టిమ్స్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. అలాగే, ఈ డిసెంబర్ నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. టిమ్స్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!