Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- ఎన్విడియా తదుపరి సీఈఓగా టిమ్ కుక్ సరైనోడు..
- జెన్సన్ హువాంగ్ అద్భుతంగా పనిచేశారు..
- ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ రావాలి..
- ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nvidia CEO: ఎన్విడియా సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం, ఆమె చైనా తరుఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో జెన్సన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు ఆయన ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈఓ, బోర్డ్ మెంబర్ పదవులకు రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రెస్ నియమితులయ్యారు.
ఇదిలా ఉంటే, ఎన్విడియా తదుపరి సీఈఓగా ఆపిల్ అధినేత టిమ్ కుక్‌ను నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగే సత్తా టిమ్ కుక్కు మాత్రమే ఉందని, ఆయనే సరైనోడు అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు.
Also Read
- Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
- Nvidia: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా..
- Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
- Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
“ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అద్భుతమైన పని చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసినందున, ఆయన స్థానంలోకి రావాల్సిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే యాపిల్‌కు చెందిన టిమ్ కుక్. ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ వస్తారు!” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
2025 నుంచి జెన్సన్ హువాంగ్, ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధాలు బలపడ్డాయి. గత రెండేళ్లుగా హువాంగ్ వైట్‌హౌజ్ ఎజెండాను పదే పదే సమర్థిస్తున్నారు. చైనా మార్కెట్‌కు అధునాతన సెమీకండక్టర్లను విక్రయించేందుకు ఎన్విడియాకు అనుమతులు ఇచ్చే అంశంపై అమెరికాతో లాబీయింగ్ చేశారు. ఈ ఏడాది మేలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించిన సమయంలో హువాంగ్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ వెంట ప్రయాణించారు. సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విందుకు కూడా హాజరయ్యారు.
తాజావార్తలు
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
-
Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
-
YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!