YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న అభివృద్ధి ప్రచారానికి, రాష్ట్రంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని తప్పుడు ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనడానికి విద్యుత్ డిమాండ్ తగ్గుదల స్పష్టమైన నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ గణాంకాల ప్రకారం 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి డిస్కంల విద్యుత్ విక్రయాలు, పంపిణీ తగ్గిపోయినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు, గృహ వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. కానీ ఏపీలో డిమాండ్ తగ్గడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్ర మందగమనానికి అద్దం పడుతోందని వివరించారు.
Also Read
- Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
- Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
- Nvidia: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా..
- Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
విద్యుత్ రంగంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా కుంటుపడిందని కాగ్ గణాంకాలను ఉదహరించారు. 2023-24లో రూ.85,922 కోట్లుగా ఉన్న రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, 2025-26 నాటికి రూ.86,552 కోట్లకు మాత్రమే చేరిందని తెలిపారు. రెండేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు కేవలం 0.15 శాతం మాత్రమే ఉండటం రాష్ట్రంలో పెట్టుబడులు పడిపోయాయనేదానికి నిదర్శనమన్నారు.
ఈ ఆర్థిక మందగమనం ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2026-27 తొలి త్రైమాసికంలో దేశంలో నాలుగో స్థానంలో ఉన్న నిరుద్యోగం, రెండో త్రైమాసికానికి రెండో స్థానానికి ఎగబాకిందని తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా 23 లక్షల ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..
-
Haldiram IPO: స్టాక్ మార్కెట్లోకి ‘హల్దీరామ్’ గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా రూ. 10 వేల కోట్ల భారీ ఐపీఓకు రంగం సిద్ధం!
-
Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
-
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!