AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.. రేపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.. అయితే, పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఏర్పాటుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ కేంద్రాలను అధికారికంగా నోటిఫై చేయాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల్లోని రూల్-6 ప్రకారం ఫారం-1 ద్వారా ఎన్నికల నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. నామినేషన్ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఏ తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు? సమయాలు ఏమిటి? అనే వివరాలను ఫారం-1లో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఒకే చోట కేంద్రీకరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. పెమ్మడపల్లె గ్రామ పంచాయతీకి చెందిన పి. రమేష్ ఈ పిటిషన్ వేశారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను రాయచోటిలో కేంద్రీకరిస్తూ నవంబర్ 6న ఎంపీడీవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఆయన సవాలు చేశారు. నామినేషన్ కేంద్రాలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం అభ్యర్థులకు అసౌకర్యంగా మారుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కోరారు.
Also Read
- AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
- YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
- AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Cyclone Threat : మురసు, అర్నబ్ తర్వాత మరో అల్పపీడనం.. ఏపీకి టెన్షన్
ఒక క్లస్టర్‌కు రెండు నుంచి నాలుగు పంచాయతీలు
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తన వాదనలను కోర్టు ముందు ఉంచింది. ఒక క్లస్టర్ పరిధిలో రెండు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించే విధానం అమల్లో ఉందని వివరించింది. నామినేషన్ కేంద్రాల ఎంపిక సమయంలో కేవలం దూరాన్ని మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ఇక, రిటర్నింగ్ అధికారులకు సహాయంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించుకునేందుకు కూడా హైకోర్టు అనుమతించింది. అయితే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి నియంత్రణలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
ఎంపీడీవో ప్రొసీడింగ్స్ తుది నోటిఫికేషన్ కాదు
నామినేషన్ కేంద్రాలను కేంద్రీకరిస్తూ నవంబర్ 6న రాయచోటి ఎంపీడీవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ తుది ఎన్నికల నోటిఫికేషన్ కాదని హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ కేంద్రాలను అధికారికంగా ప్రకటించాల్సింది రిటర్నింగ్ అధికారేనని పేర్కొంది. రూల్-6 ప్రకారం ఫారం-1లో ఎన్నికల నోటీసు జారీ చేయాలని, అందులో నామినేషన్ కేంద్రం, తేదీలు, సమయాలను స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఏర్పాటు, వాటి అధికారిక ప్రకటన, రిటర్నింగ్ అధికారుల బాధ్యతలపై హైకోర్టు స్పష్టత ఇచ్చినట్లయింది.
తాజావార్తలు
-
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
-
Soil: మట్టి…! బంగారం కంటే ఎందుకు విలువైంది?
-
Vivo X500 Series: వివో X500 Series ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ
-
Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
ట్రెండింగ్
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..