Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddu Jonnalagadda: ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి, నిజంగానే ‘స్టార్ బాయ్’ అనిపించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ముఖ్యంగా ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ. 60 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో సిద్ధు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఆ తర్వాత సిద్ధు వేసిన అడుగులు తారుమారయ్యాయి. వరుస ఫ్లాపులతో పాటు అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్టులు కూడా ఆగిపోవడంతో ఏడాది పాటు సిల్వర్ స్క్రీన్కు దూరమయ్యాడు. ఎట్టకేలకు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్న సిద్ధు, ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు కనిపిస్తున్నాడు.
స్వతహాగా మంచి రైటర్ అయిన సిద్ధు, ‘టిల్లు స్క్వేర్’ తర్వాత కథల ఎంపికలో అంచనా తప్పాడు. ఫామ్ కోల్పోయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన ‘జాక్’ సినిమా కనీసం రూ. 10 కోట్లు కూడా రాబట్టలేక భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనను దర్శకురాలిగా పరిచయం చేస్తూ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ కూడా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. 2025 దసరాకు రిలీజైన ఈ సినిమా తర్వాత సిద్ధు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కేవలం హీరోగానే కాకుండా, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసినా అవి కూడా నిరాశపరిచాయి.
Also Read
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
- Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
- Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
- Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
సిద్ధు కెరీర్లో గ్యాప్ రావడానికి ప్రధాన కారణం రెండు పెద్ద సినిమాలు క్యాన్సిల్ అవ్వడమే. ‘టిల్లు’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ, సిద్ధుతో ‘టిల్లు క్యూబ్’ కాకుండా ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ‘బ్యాడ్స్’ అనే ఫ్రెష్ ప్రాజెక్ట్ ప్రకటించింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తిరిగి తీసుకొచ్చే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో, రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో ‘కోహినూర్ పార్ట్-1’ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 2026 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా బడ్జెట్ కారణాల వల్ల పక్కన పెట్టేశారు.
ఏడాది పాటు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న సిద్ధు, ఇప్పుడు ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి రెండు ఆసక్తికరమైన సినిమాలను లైన్లో పెట్టాడు. ఇందులో ఒకటి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. మరోవైపు సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమా. దీని షూటింగ్ కూడా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. మోహన్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే సిద్ధు ఈసారి పూర్తిస్థాయి లవ్ స్టోరీతో రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ‘ఆయ్’, ‘రాకాస’ సినిమాలతో ఆకట్టుకున్న నయన్ సారిక ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలతోనైనా సిద్ధు మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
-
Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!