Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Safety Raids: నగరంలోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సంస్థలైన కేఎఫ్‌సీ (KFC), డొమినోస్ పిజ్జా (Domino’s Pizza) అవుట్లెట్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ (TG SAFE) ఎన్ఫోర్స్మెంట్ విభాగం మెరుపు దాడులు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 13 ప్రత్యేక బృందాలు క్యూర్ (CURE) రీజియన్ పరిధిలోని మొత్తం 26 అవుట్లెట్లలో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.
తనిఖీల్లో బయటపడ్డ దిగ్భ్రాంతికర వాస్తవాలు:
తనిఖీల సందర్భంగా పలు అవుట్లెట్లలో ఆహార భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు అధికారులు గుర్తించారు. ఆహారం తయారు చేసే సిబ్బంది హెయిర్ నెట్స్, ఆప్రాన్లు ధరించకపోవడం. వంటగదులు, స్టోరేజ్ ఏరియాల్లో తీవ్రమైన దుర్వాసన, బొద్దింకలు, ఈగల బెడద ఉండటం. ఎలుకల విసర్జనలు (Rat feces), గడువు తీరిన (Expired) ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం. ఒకసారి వాడిన వంట నూనెను ఫిల్టర్ చేసి మళ్లీ వినియోగించేందుకు అనధికారికంగా ‘మెగ్నీషియం సిలికేట్’ వాడుతున్నట్లు గుర్తించారు.
Also Read
- Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
- New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
- Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..
అధికారుల కఠిన చర్యలు:
ఈ ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందించిన అధికారులు కల్తీ అనుమానంతో 20 ఆహార నమూనాలను సేకరించారు. అలాగే, సుమారు 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను సీజ్ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా తీవ్రమైన లోపాలు ఉన్న 9 అవుట్లెట్ల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
లైసెన్సులు సస్పెండ్ అయిన 9 అవుట్లెట్ల వివరాలు:
1. కేఎఫ్‌సీ (మదీనాగూడ, మియాపూర్): నీటి లీకేజీ, కిచెన్‌లో దుర్వాసన, వాడిన నూనె కోసం మెగ్నీషియం సిలికేట్ వాడకం.
2. డొమినోస్ పిజ్జా (శరత్ సిటీ మాల్, కొండాపూర్): బొద్దింకల బెడద, ప్యాకింగ్ మెటీరియల్‌కు ఫుడ్ గ్రేడ్ సర్టిఫికెట్ లేకపోవడం, గడువు తీరిన వస్తువులు లభ్యం.
3. కేఎఫ్‌సీ (సింధీ కాలనీ, సికింద్రాబాద్): ఈగల బెడద, మెగ్నీషియం సిలికేట్ వాడకం.
4. కేఎఫ్‌సీ (పంచ్ మొహల్లా, చార్మినార్): చిల్లర్ రూమ్‌లో దుర్వాసన, మెగ్నీషియం సిలికేట్ వాడకం.
5. కేఎఫ్‌సీ (మూసారాంబాగ్): తుప్పు పట్టిన చిల్లర్ రూమ్, కోల్డ్ రూమ్‌లో నీరు కారడం, గోడలపై ఫంగస్, జిడ్డు పట్టిన పాత్రలు, బొద్దింకల బెడద.
6. కేఎఫ్‌సీ (బంజారాహిల్స్): చిల్లర్‌లలో నీరు నిలిచిపోవడం, మెగ్నీషియం సిలికేట్ వాడకం.
7. కేఎఫ్‌సీ (శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ): ఆహార తయారీకి అపరిశుభ్రమైన పాత్రల వినియోగం, మెగ్నీషియం సిలికేట్ వాడకం.
8. డొమినోస్ పిజ్జా (ఇనార్బిట్ మాల్, మాదాపూర్): సిబ్బందికి హెయిర్ నెట్స్/ఆప్రాన్లు లేకపోవడం, ఎలుకల విసర్జనలు, బొద్దింకలు, అపరిశుభ్రమైన స్టోర్ రూమ్.
9. కేఎఫ్‌సీ (ఇనార్బిట్ మాల్, మాదాపూర్): సిబ్బందికి హెయిర్ నెట్స్/ఆప్రాన్లు లేకపోవడం, మెగ్నీషియం సిలికేట్ వాడకం.
నోటీసులు జారీ అయిన ఇతర బ్రాంచీలు:
షోకాజ్ నోటీసులు (5 బ్రాంచీలు): కార్ఖానా, గచ్చిబౌలి, హైటెక్ సిటీలలోని డొమినోస్ బ్రాంచీలు; నిజాంపేట, గచ్చిబౌలిలలోని కేఎఫ్‌సీ బ్రాంచీలకు జరిమానాలు విధించేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇంప్రూవ్మెంట్ నోటీసులు (8 బ్రాంచీలు): నిజాంపేట, మియాపూర్, హిమాయత్‌నగర్, మలక్పేటలలోని డొమినోస్ బ్రాంచీలు; కొండాపూర్, కార్ఖానా, హిమాయత్‌నగర్, షేక్పేటలలోని కేఎఫ్‌సీ బ్రాంచీలకు మార్పులు చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. వీటిని మళ్లీ తనిఖీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు.
స్విగ్గీ, జొమాటోలకు ఆదేశాలు:
లైసెన్సులు సస్పెండ్ అయిన 9 అవుట్లెట్ల వివరాలను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato)లకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఆయా అవుట్లెట్లను తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని (Delist) ఆదేశించనున్నారు.
తనిఖీలు నిర్వహించిన మొత్తం 26 అవుట్లెట్ల జాబితా:
1. డొమినోస్ పిజ్జా – విక్రంపురి కాలనీ, కార్ఖానా
2. డొమినోస్ పిజ్జా – నిజాంపేట
3. కేఎఫ్‌సీ – కార్ఖానా, కంటోన్మెంట్
4. కేఎఫ్‌సీ – నిజాంపేట
5. డొమినోస్ పిజ్జా – గచ్చిబౌలి
6. కేఎఫ్‌సీ – గచ్చిబౌలి
7. డొమినోస్ పిజ్జా – మియాపూర్
8. కేఎఫ్‌సీ – మదీనాగూడ, మియాపూర్
9. డొమినోస్ పిజ్జా – శరత్ సిటీ మాల్, కొండాపూర్
10. కేఎఫ్‌సీ – శరత్ సిటీ మాల్, కొండాపూర్
11. డొమినోస్ పిజ్జా – సింధీ కాలనీ, సికింద్రాబాద్
12. కేఎఫ్‌సీ – సింధీ కాలనీ, సికింద్రాబాద్
13. కేఎఫ్‌సీ – పంచ్ మొహల్లా, చార్మినార్
14. కేఎఫ్‌సీ – మూసారాంబాగ్
15. డొమినోస్ పిజ్జా – హిమాయత్‌నగర్
16. కేఎఫ్‌సీ – హిమాయత్‌నగర్
17. కేఎఫ్‌సీ – బంజారాహిల్స్
18. డొమినోస్ పిజ్జా – జూబ్లీహిల్స్
19. డొమినోస్ పిజ్జా – మాసాబ్ ట్యాంక్
20. డొమినోస్ పిజ్జా – మలక్‌పేట
21. కేఎఫ్‌సీ – షేక్‌పేట
22. డొమినోస్ పిజ్జా – జిల్లెలగూడ
23. డొమినోస్ పిజ్జా – మైండ్‌స్పేస్, హైటెక్ సిటీ
24. కేఎఫ్‌సీ – శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ
25. డొమినోస్ పిజ్జా – ఇనార్బిట్ మాల్, మాదాపూర్
26. కేఎఫ్‌సీ – ఇనార్బిట్ మాల్, మాదాపూర్
తాజావార్తలు
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
-
Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!