Thota Chandrasekhar: ఏపీలో బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Will Contest From All Constituencies In Andhra Pradesh Says Thota Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్‌నే ఏపీలో అమలు చేస్తామని అన్నారు. ఏపీకి ఎన్నో సమస్యలున్నాయని.. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలోనూ కేంద్రం సహకారం రావడం లేదన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.
Anakapalli Crimes: గుర్తు తెలియని శవాల కలకలం.. నెల రోజుల్లో రెండు హత్యలు
Also Read
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో ఎన్నో సమస్యలు తలెత్తాయని.. ఇంతవరకు రాజధాని లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని.. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఇప్పటికీ మెట్రో రైలు సౌకర్యం లేదన్న ఆక్ష్న.. దక్షిణాదిపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. వీటిపై కేంద్రాన్ని నిలదీసిన వాళ్లు ఎవరూ లేరని.. కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ అవతరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని అన్నారు. దేశంలో స్వశక్తితో బీఆర్ఎస్ బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Chhattisgarh: కొత్తగా పెళ్లైన జంట.. రిసెప్షన్‌కు ముందు కత్తిపోట్లతో మృతి.. అసలేం జరిగింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!