Unidentified Dead Bodies Found In Anakapalli Elamanchili: అనకాపల్లిలోని ఎలమంచిలిలో గుర్తు తెలియని శవాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అత్యంత దారుణంగా హత్య చేసి.. ఎలమంచిలిన చుట్టుపక్కల మృతదేహాలను హంతకులు పడేస్తున్నారు. నెల రోజుల్లోనే రెండు హత్యలు చోటు చేసుకోవడం, మృతదేహాల పరిస్థితి దారుణంగా ఉండటంతో.. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అవి ఎవరివి? హత్యకు గల కారణాలేంటి? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు.
Varudu Kalyani: చంద్రబాబు ద్రోహం చేస్తే.. జగన్ రాజకీయ హక్కులు కల్పించారు
ఎలమంచిలిలోని ఎర్రవరం సమీపంలో సగం కాలిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈరోజు ఉదయం అటుగా స్థానికులు వెళ్తుండగా, వారికి ఈ మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరో మహిళను హత్య చేసి, సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెను ఎక్కడో చంపేసి, మృతదేహాన్ని ఇక్కడ వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Lakshman Fruite: లక్ష్మణ ఫలం.. పవర్ తెలిస్తే అస్సలు వదలరండోయ్
గతంలో ఎలమంచిలి సమీపంలోని కొత్తపాలెం చెరుకలు కాటా వద్ద కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అత్యంత దారుణంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి.. శరీర భాగాలను కొత్తపాలెం బ్రిడ్జ్ వద్ద పారేశారు. ఆ డెడ్ బాడీ యువకుడిదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికులకు శరీర భాగాలు కనిపించడంతో, వాళ్లు పోలీసులకు తెలియజేశారు.