Chairman's Desk: ఆంధ్రులకు రాజధాని శాపం ఉన్నట్టుగా ఉంది. పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా చెన్నయ్, కర్నూలు, హైదరాబాద్, ఇప్పుడు అమరావతి. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక స్థిరమైన రాజధాని ఏర్పడలేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా మూడేళ్లలో రాజధానిని ఏర్పాటు చేసుకోగలిగాయి. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఇలా రకరకాల కారణాలతో ఏపీ రాజధాని అర్ధంకాని బ్రహ్మపదార్ధంగా మారిపోయింది.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి…
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు…