Pulivendula Election: కడప జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
Pulivendula: కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ (ఆగస్టు 10న) సాయంత్రం 5గంటలకు తెర పడనుంది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 12న) నాటి పోలింగ్‌కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.
Gadikota Srikanth Reddy: రాయచోటి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఓట్ల గణాంకాలను వివరంగా వెల్లడించారు. ఇక ఆయన తెలిపిన సమాచారం మేరకు 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024 ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో పోలైన ఓట్లపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో…
CM Chandrababu : ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజల తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నాటి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్మాద పాలనను తుది గా అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. “జూన్ 4….…
ఏపీలో గురువారం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్‌తో పాటు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్ 9) వెలువడనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతా సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలన్నింటికి కలిపి 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్(సీఎపీఎఫ్) బలగాలను మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.