మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రం చేస్తున్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ 45 రోజుల పాటు ఈ పాదయాత్ర చేయనున్నారు. డిసెంబర్ 15కు తిరుమలకు చేరుకునే విధంగా ఈ పాదయాత్ర ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రాజధాని రైతులు చేస్తోన్న మహాపాదయాత్రకు ఊరూరా రైతులు, ప్రజలు నీరాజనం పడుతున్నారు. రాజకీయ ప్రముఖులు, తదితరులు రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే తాజాగా నెల్లూరులో రైతుల పాదయాత్రలో పాల్గొని ఏపీ బీజేపీ నాయకులు రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. అమిత్ షా ఆదేశాలతోనే ఈ పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని గతంలో తీర్మానించామన్నారు. పాదయాత్రలో ఏపీబీజేపీ చీఫ్ సోమువీర్రాజు, సుజనా, సీఎం రమేశ్, పురంధేశ్వరి, సత్యకుమార్‌లతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.