రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలని, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు.…
అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.
‘మొంథా’ తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి నేలవాలిపోయింది. కంకుల దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. కంటిన్యూగా వర్షం కురుస్తుంఢంతో పంటపై రైతులు ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే పంట నాశనం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి…
AP Farmers to Receive RS 7000 in First Phase on August 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్ సిక్స్‌లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ…
Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.…
కూటమి ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 27 నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గం వారీగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని వియవంతం చెయ్యాలని కార్యకర్తలను కోరారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అబద్దాలని ప్రజలకు వివరిస్తాం అని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి మరీ దారణంగా ఉందని, రైతులను నిర్లక్ష్యం చేస్తే…
సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులు ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే.. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి నిమ్మల చెప్పారు. గత ఐదు ఏళ్లలో అధికారులతో రైతులు మాట్లాడి…
మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.