తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తుని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ శేషగిరిరావు పై ఇంటి వద్ద కత్తితో దాడి చేశాడో దుండగుడు. భవానీమాలలో వచ్చిన వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో శేషగిరిరావు చేతికి,తలకి బలమైన గాయాలు తగిలాయి. దీంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం బైక్ పై దుండగుడు పరారయినట్టు స్థానికులు చెబుతున్నారు. శేషగిరిరావును కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. శేషగిరిరావుని పరామర్శించారు టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు.
Read Also: VIjayawada Driving Licences: బెజవాడలో విచ్చలవిడిగా డ్రైవింగ్ లైసెన్స్ ల దందా
మాజీ మంత్రి యనమల మాట్లాడుతూ.. ఎదుటి వాళ్ళను అడ్డుకోవడానికి తునిలో ఒక ఆర్గనైజేషన్ పని చేస్తుందన్నారు. అక్కడ ఉన్న నేత మంత్రి అయ్యాక ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కి సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. తునిలో జనం భయ బ్రాంతులకి గురి అవుతున్నారు, శాంతియుత వాతావరణం లేదు. ఈ ఘటనకి ప్రభుత్వం, జగన్ బాధ్యత వహించాలి. తునిలో ఇటువంటి దోపిడీలు, దాడులు ఎప్పుడూ చూడలేదన్నారు. తుని లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తామని స్వయంగా వాళ్లే చెప్పారు. ఈ దాడి ఘటనను ప్రోత్సాహించిన వాళ్ళను పట్టుకోవాలన్నారు.
మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడుతూ.. తునిలో లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన మంత్రి హింసని ప్రోత్సహిస్తున్నారు. రాజా ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. మంత్రి వలన ప్రాణ హాని ఉందని గతంలో శేషగిరి ఎస్పీ కి ఫిర్యాదు చేసాడు. మంత్రి ఈ ఘటనకి బాధ్యత తీసుకోవాలి. తుని టీ డీ పీ ఇంచార్జ్ యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో మంత్రి చూడాలి. తుని సిఐల పాత్ర ఈ ఘటనలో ఉందన్నారు. వారికి ఈ విషయం తెలుసు.. ఆ ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని యనమల కృష్ణుడు డిమాండ్ చేశారు.
Read Also: Twitter: అలా అయితేనే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్