వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఏపీలో జగన్ పాలనపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రోజూ మామూలుగా మారిన అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై టీడీపీ మండిపడుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ అథఃపాతాళానికి వెళ్ళిపోయిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ విషయంలో మాట్లాడిన అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీలో అధ్వాన్న పరిస్థితిపై మాట్లాడితే వైసీపీ దొంగల ముఠా విరుచుకుపడింది. పక్క రాష్ట్రాల సీఎంలు ఒక్కసారి ఏపీకి రండి. సొంత ఖర్చులు పెట్టి తీసుకొస్తాం. ఏపీని జగన్మోహన్ రెడ్డి…
మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు. 28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద…