మీకు డ్రైవింగ్ రాకపోయినా బెజవాడ వెళితే చాలు.. మీకు క్షణాల్లో డ్రైవింగ్ లైసెన్స్ చేతిలోకి వస్తుంది. బెజవాడలో విచ్చలవిడిగా డ్రైవింగ్ లైసెన్స్ దందా నడుస్తోంది. విజయవాడ RTA కేంద్రంగా లైసెన్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లంచాలుంటే చాలు డ్రైవింగ్ రాకున్నా లైసెన్స్ పక్కాగా మీ చేతిలోకి వచ్చి వాలుతుంది. ఎన్టీవీ నిఘాలో బెజవాడ లైసెన్స్ అమ్మకాలు బయటపడ్డాయి. నిఘాలో వెళ్ళిన ఎన్టీవీ ప్రతినిధికి డ్రైవింగ్ రాకున్నా లైసెన్స్ ఇప్పిస్తా అన్నాడు ఏజెంట్…హోమ్ గార్డ్ ల నుండి బ్రేక్ ఇన్స్పెక్టర్ల వరకు మా చేతిలోనే వున్నారంటూ బదులిచ్చాడు.
టూ వీలర్ మేనేజ్ చేస్తే ఫోర్ వీలర్ కు కూడా లైసెన్స్ ఇస్తున్న వైనం బట్టబయలయింది. డబ్బుకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాల్నే అమ్మకానికి పెట్టిన RTA అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు. అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారు బ్రోకర్లు. రూ,6,500 కడితే డ్రైవింగ్ రాకున్నా 4 వీలర్ లైసెన్స్ మీకు వస్తుంది. ఏజెంట్ల నుండి RTA అధికారులకు అందుతున్న ముడుపులతో ఈ దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. LLR పరీక్షా కూడా రాయకుండా,వెళ్ళి కూర్చుంటే చాలంటున్నారు ఏజెంట్స్…ఈ ఏడాది నగరంలో ఇప్పటి వరకు నమోదైన రోడ్ యాక్సిడెంట్స్ 967. గాయాలపాలయినవారు 815 మంది, మరణించినవారు 197 అని అధికారులే గణాంకాలు విడుదలచేశారు.
Read ALso:James Webb Space Telescope: అప్పుడే పుడుతున్న నక్షత్రాన్ని క్లిక్ మనిపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
డ్రైవింగ్ రాకుండా తీసుకున్న లైసెన్స్ లతో రెచ్చిపోతున్నారు వాహనదారులు. అధికారులు,వాహనదారుల నిర్లక్ష్యంతో బలవుతున్నారు అమాయకులు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవింగ్ రాదని భయపడాల్సిన అవసరమే లేదని వచ్చి కూర్చుంటే చాలు లైసెన్స్ వచ్చేస్తుందంటూ సమాధానమిచ్చాడు ఏజెంట్. డ్రైవింగ్ టెస్ట్ ల వద్ద అంత మా వల్లే అని హోమ్ గార్డులు,బ్రేక్ ఇన్స్పెక్టర్లు మా చేతిలోనే ఉన్నారంటూ అధికారుల అండదండలతో డ్రైవింగ్ రాకున్నా డ్రైవింగ్ లైసెన్స్ అమ్మేస్తున్నాడు.. ఆర్టీఏ ఆఫీస్ ముందే గస్తీ కాస్తున్న ఏజెంట్స్ అధికారులకు లంచాలు ఇస్తూ ప్రజల ప్రాణాల్ని దొంగ లైసెన్స్ లతో అమ్మేస్తున్నారు. లంచాలకు అలవాటు పడ్డ అధికారుల సహకారంతో ఏజెంట్లు ఇస్తున్న లైసెన్స్ లతో రోడ్లపై రక్తపాతం సృష్టిస్తున్నారు కొంతమంది వాహనదారులు.
Read Also: Chanrababu Sensational Comments Live: గెలిపించకపోతే రాజకీయాలకు గుడ్ బై