AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ.. ప్రధాన ఉద్యోగ సంఘం నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు.. గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై చర్చ జరిగింది.. నవంబర్ 2025 నుంచి ఒక డీఏ మంజూరు చేశారు.. అలాగే, హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇది బిగినింగ్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు.. పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పినట్లు ఎన్జీఓ నేత విద్యాసాగర్ చెప్పుకొచ్చారు.
Read Also: Blood Group Mismatch: వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ప్రాణాలకు ప్రమాదామా?
ఇక, ఉద్యోగ సంఘం జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులు- ప్రభుత్వం వేరు కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.. కలిసి పని చేద్దాం, రాష్ట్రం పునర్నిర్మాణం చేద్దాం అని తెలిపారు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమావేశం జరిగింది.. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్.. రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు.. అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు.. క్యాబినెట్ సబ్ కమిటీ కంటిన్యూగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also: Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
అలాగే, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర రావు మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా పెండింగులో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలు వెంటనే క్లీయర్ చేస్తూ జీఓ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయడం పట్ల హర్షనీయం అన్నారు.