చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్రమ మైనింగ్ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి జిల్లాకు ఏం చేశాడని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాలని కలలు కన్నాడని చెబుతున్నారని, 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు దేవుఉ అయ్యారని, చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టమని అన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు మైనింగ్ రాయల్టీపై కన్సెషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
Read: బూస్టర్ డోస్‌పై భారత్ బయోటెక్ కీలక వ్యాఖ్యలు…
ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే చంద్రబాబుకు ఈ బాధ ఉందని అన్నారు. చంద్రబాబు దుష్టపాలనను వదిలించుకోవడానికి 151 సీట్లు వైసీపీకి ఇచ్చారని అన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా కుప్పంలో పర్యాటిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బాబును తప్పకుండా ఓడిస్తామని, ఇది తప్పకుండా జరుగుతుందని అన్నారు. బాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లాలోని ప్రజలు నమ్మరని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.